HomeCinemaDC Movie Review: లోకేష్ కనగరాజ్ యాక్షన్ డ్రామా మెప్పించిందా?

DC Movie Review: లోకేష్ కనగరాజ్ యాక్షన్ డ్రామా మెప్పించిందా?

DC Movie Review: దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కథానాయకుడిగా మారి నటించిన చిత్రం ‘డీసీ’. అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ రివెంజ్‌ డ్రామా ఎలా ఉందో చూద్దాం.

DC కథ ఏమిటంటే:

ప్రభుత్వ ఆయుధాల వాహనాన్ని దోచుకుని, ఓ ఎస్సైని కాల్చి చంపుతుంది దేవదాస్‌ (లోకేశ్‌ కనగరాజ్‌) గ్యాంగ్‌. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ లాడ్జి బార్‌లో పాడే పార్వతితో దేవదాస్‌కు పరిచయం ఏర్పడి, ప్రేమగా మారుతుంది. అయితే పోలీసుల కాల్పుల్లో పార్వతి చనిపోతుంది.

పోలీసుల బారిన పడకుండా తప్పించుకునే ప్రయత్నంలో, దేవదాస్‌కు తను ఉన్న చోటుని పోలీసులకు పట్టించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్రమంలోనే అనుకోకుండా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న చంద్రిక (వామికా గబ్బి) పరిచయమవుతుంది. అక్కడ నుంచి వారిద్దరి ప్రయాణం కొత్త మలుపు తిరుగుతుంది.

అసలు దేవదాస్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? చంద్రికను కలిశాక అతడి ప్రయాణం ఎలా సాగింది? ఎస్సైని చంపాల్సిన అవసరం అతనికి ఎందుకొచ్చింది? అన్నదే మిగతా కథ.

lokesh kanagaraj wamiqa gabbi dc movie review telugu

DC Movie ఎలా ఉందంటే:

‘పోలీసులు తప్పు చేస్తే ఎవరిని అడగాలి?’ అనే పాయింట్‌తో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ రివెంజ్ డ్రామాను రూపొందించారు. రా అండ్ రస్టిక్ కోణంలో సినిమాను ఆవిష్కరించే ప్రయత్నం చేసినా, అది కొంతవరకే వర్కవుట్ అయింది.

కథ చాలా ఫ్లాట్‌గా, నెమ్మదిగా సాగుతుంది. ప్రథమార్థంలో దేవదాస్-పార్వతిల ప్రేమ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు, కథను ముందుకు వెళ్ళదు. అయితే పార్వతి మరణం తర్వాత కథ ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా విరామానికి ముందు వచ్చే యాక్షన్ సీన్, దానికి తోడైన అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్‌లో మంచి హై ఇస్తాయి.

ద్వితీయార్ధమే ఈ సినిమాకి అసలైన బలం. దేవదాస్‌, చంద్రికల మధ్య సాగే సన్నివేశాలు, వారి బంధం కథపై మంచి ప్రభావం చూపుతాయి. డబ్బు కోసం చంద్రిక వేసే ప్లాన్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దేవదాస్‌ను విడిపించే సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్, ముగింపు పరవాలేదనిపిస్తాయి.

అయితే, దర్శకుడు అరుణ్ ఎంచుకున్న పాయింట్‌లో స్పష్టత కొరవడింది. దేవదాస్ పాత్రతో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేరు. తన పాత సినిమా ‘సానికాయిదం’ ఫార్మాట్‌లోనే దీన్ని కూడా నడిపించినట్లు అనిపిస్తుంది. తమిళ నేటివిటీ ప్రభావం కూడా కాస్త ఎక్కువగానే కనిపించింది.

ఎవరెలా చేశారంటే:

నటుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ ఫర్వాలేదనిపించారు. పాత్రలో పెద్దగా నటనకు ఆస్కారం లేకపోవడంతో చాలా వరకు సీరియస్ ముఖంతోనే కనిపిస్తారు. అయితే యాక్షన్ సీన్స్ బాగా చేశారు.

సినిమాకి అసలైన హీరో వామికా గబ్బి. చంద్రిక పాత్రలో ఆమె నటన, ఆహార్యం అద్భుతం. ప్రథమార్థం కంటే ద్వితీయార్ధంలో ఆమె పాత్రే సినిమాను నిలబెట్టింది.

సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా అనిరుధ్‌ అందించిన నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను వేరే స్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు కుదిరాయి.

Korean Kanakaraju Review: కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ: హిట్టు పడ్డట్టేనా?

చివరిగా DC Movie Review:

మంచి యాక్షన్, అనిరుధ్ రీ-రికార్డింగ్, వామికా గబ్బి నటన కోసం ఈ రివెంజ్ డ్రామాను ఒకసారి చూడొచ్చు. కానీ స్లో నరేషన్, బలహీనమైన ఎమోషన్స్ నిరాశపరుస్తాయి.

Renukaswamy Murder Case: నటుడు దర్శన్, పవిత్రలకు బిగుస్తున్న ఉచ్చు?

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments