Makutam Movie Review:విశాల్ సినిమా అంటే మన టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఆయన చేసే యాక్షన్, ఎంచుకునే కథలు మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి. అయితే ఈసారి నటనతో పాటు తొలిసారి డెరైక్టర్ మెగాఫోన్ పట్టి ‘మకుటం’ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. మరి డెరైక్టర్‌గా విశాల్ ఆకట్టుకున్నారా? సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
Makutam Movie కథేంటి?
కృపాకరం (విశాల్) చెన్నైలో ఓ సింపుల్ మెడికల్ రిప్రజెంటేటివ్. భార్య జమున (దుషారా విజయన్), ఇద్దరు పిల్లలతో హ్యాపీగా సాగిపోయే అతని కుటుంబం అది. మామగారి కోరిక మేరకు కష్టపడి సెకండ్ హ్యాండ్ కార్ కొని, ఫ్యామిలీతో కలిసి ఊటీ ట్రిప్‌కి వెళ్తాడు. కానీ, అక్కడ అనుకోకుండా కొందరు రౌడీలు వీరి కార్‌పై కాల్పులు జరుపుతారు. ఈ ఘోర దాడిలో కృపాకరం తన భార్యను, ఒక బిడ్డను కోల్పోతాడు.
తీవ్ర విషాదంలో ఉన్న కృపాకరాన్ని పలకరించడానికి విశాఖపట్నం పోర్ట్‌ను శాసించే అతని తండ్రి లింగ (మళ్ళీ విశాల్) వస్తాడు. కానీ, తండ్రిని చూడగానే కృపాకరం భగ్గుమంటాడు. తన కుటుంబం నాశనమవ్వడానికి తండ్రే కారణమని నిందిస్తాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య ఉన్న విభేదాలేంటి? అసలు ఈ దాడి వెనుక ఉన్నది ఎవరు? లింగ భార్య అన్నపూర్ణ (అంజలి) ఎలా చనిపోయింది? చివరకు ఈ తండ్రీకొడుకులు ఒకటయ్యారా లేదా అనేది మిగతా కథ.
Makutam Movie ఎలా ఉందో చూద్దాం..
యాక్టర్ నుండి డెరైక్టర్‌గా మారినప్పుడు విశాల్ మీద భారీ అంచనాలే ఉంటాయి. కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో ఆయన కాస్త తడబడ్డారు. మనకి ఇప్పటికే అలవాటైన రొటీన్ రివెంజ్ డ్రామానే మళ్ళీ తెరపైకి తెచ్చారు. దానికి తోడు దాదాపు 3 గంటల నిడివి ప్రేక్షకుడి ఓపికకు పెద్ద పరీక్షే!
ఫస్ట్ హాఫ్‌లో హీరో ఫ్యామిలీ డ్రామా, అప్పులు, కార్ కొనడం అంటూ దాదాపు గంటసేపు సీరియల్ మోడ్‌లోనే కథ నడుస్తుంది. ఊటీ దాడి తర్వాతే అసలు కథలో కాస్త స్పీడ్ పెరుగుతుంది. ఇక విశాల్ తండ్రి క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వగానే ఏదో ‘బాషా’ రేంజ్ ఎలివేషన్ ఉంటుందని ఆశిస్తాం, కానీ అక్కడ వచ్చే ఫ్లాష్‌బ్యాక్ కూడా చాలా రొటీన్‌గా సాగుతుంది. హీరోయిన్ హీరోని రౌడీ అనుకోవడం, ఆ తర్వాత అతను మంచివాడని తెలుసుకొని ప్రేమలో పడటం.. ఇవన్నీ మనం వందల సినిమాల్లో చూసేసిన సీన్లే.
అయితే చైనా నుంచి వచ్చే నకిలీ గూడ్స్ వల్ల జరిగే నష్టం అనే ఒక కొత్త పాయింట్‌ను ఇందులో టచ్ చేశారు. కానీ దాన్ని కూడా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయకుండా రొటీన్ ఫైట్లతో ముగించేశారు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం మాస్ ఆడియన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి.
Makutam Movie ప్లస్ పాయింట్స్:
-
విశాల్ : డ్యూయల్ రోల్లో ఆయన నటనలోని డిఫరెంట్ వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి.
-
యాక్షన్ సీక్వెన్సెస్: క్లైమాక్స్ మరియు ఊటీ ఎపిసోడ్లో వచ్చే ఫైట్స్ బాగున్నాయి.
-
మ్యూజిక్: జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మంచి లైఫ్ ఇచ్చింది.
-
కొత్త పాయింట్: నకిలీ వస్తువుల ఇంపోర్ట్ బ్యాక్‌డ్రాప్ తీసుకోవడం.
Makutam Movie మైనస్ పాయింట్స్:
-
రొటీన్ కథనం: పాతకాలపు రివెంజ్ డ్రామా ఫార్మాట్.
-
అతి పెద్ద నిడివి: 3 గంటల రన్‌టైమ్ బోర్ కొట్టిస్తుంది.
-
స్లో ఫస్ట్ హాఫ్: కథలోకి వెళ్లడానికి చాలా టైమ్ తీసుకున్నారు.
-
సాధారణ ఫ్లాష్‌బ్యాక్: తండ్రి క్యారెక్టర్ ఎలివేషన్ అనుకున్నంత రేంజ్లో లేదు.
Makutam Movie లో ఎవరెలా చేశారంటే..
దర్శకుడి కంటే నటుడిగానే విశాల్ ఎక్కువ మార్కులు కొట్టేశారు. కృపాకరం, లింగ రెండు పాత్రల్లోనూ డిఫరెన్స్ బాగా చూపించారు. ముఖ్యంగా మాస్ రోల్లో ఆయన బాడీ లాంగ్వేజ్ మెప్పిస్తుంది. దుషారా విజయన్, అంజలి తమ పరిధి మేర నటించి మెప్పించారు. టెక్నికల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంది, జి.వి. ప్రకాష్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్.
Makutam Movie Review Final Verdict: ముగింపు
ఒక హీరో డెరైక్టర్ కావడం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ విషయమే, కానీ విశాల్ ఈ ‘మకుటం’ విషయంలో కథ, కథనాలపై ఇంకాస్త హోమ్‌వర్క్ చేసి ఉంటే బాగుండేది. అవుట్‌డేటెడ్ ఫార్మాట్, లెంథీ రన్‌టైమ్ పక్కన పెడితే.. రొటీన్ మాస్ యాక్షన్ డ్రామాలు మరియు విశాల్ ఫైట్స్ ఇష్టపడేవారికి ఇది ఒకసారి చూడదగ్గ సినిమా!



