Sowcar Janaki Passed Away:ఒక సినిమా హిట్టయితే ఆ పేరు ఇంటిపేరుగా మారిపోవడం చాలా అరుదు. కానీ, ఏడు పదుల క్రితం వచ్చిన ‘షావుకారు’ చిత్రంతో ఆ ఘనత సాధించి, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు సీనియర్ నటి ‘షావుకారు జానకి’ (Senior Actress Sowcar Janaki). అలాంటి ఒక దిగ్గజ నటి, ఐదు తరాల ప్రేక్షకులను అలరించిన కళాతల్లి ముద్దుబిడ్డ ఇక లేరు అనే వార్త (Sowcar Janaki death news) ప్రతీ సినిమా ప్రేమికుడి హృదయాన్ని బరువుక్కిస్తోంది.
గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని కావేరి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు (Demise).
1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన జానకి గారు (అసలు పేరు టేకుమళ్ల జానకి), చిన్నతనంలోనే నటనపై ఉన్న ఇష్టంతో నాటకాల బాట పట్టారు. పదేళ్లకే రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా అలరించిన ఆమె, 1943లో ‘రక్షా రేఖ’తో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1950లో వచ్చిన ‘షావుకారు’ సినిమా ఆమె కెరీర్‌ను, జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ చిత్రం అందించిన గ్రాండ్ సక్సెస్‌తో జానకి గారు కాస్త ‘షావుకారు జానకి’గా మారిపోయారు. ప్రముఖ నటి కృష్ణకుమారి గారు ఈమెకు స్వయానా తోబుట్టువు కావడం విశేషం (Krishna Kumari Sister).
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 400కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె, హిందీ, మలయాళంలోనూ తన మార్క్ చూపించారు. ‘రోజులు మారాయి’, ‘కన్యాశుల్కం’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘తోడికోడళ్ళు’, ‘సంసారం ఒక చదరంగం’ వంటి ఎన్నో క్లాసిక్స్ నుంచి రీసెంట్గా వచ్చిన ‘బాబు బంగారం’, ‘గీతాంజలి’, ‘అన్నీ మంచి శకునములే’ వరకు ఐదు తరాల హీరోలతో కలిసి నటించారు. క్యారెక్టర్ ఏదైనా సరే, అందులో జీవించేసే ఆమె నటనా ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో ఆమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది.
అభినయానికి నిలువెత్తు రూపంగా నిలిచి, సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించిన షావుకారు జానకి గారి మరణం తీరని లోటు. రీల్‌పైన మాత్రమే కాదు, ప్రేక్షకుల రియల్ జ్ఞాపకాల్లోనూ ఆమె ఎప్పటికీ చిరస్మరణీయురాలే. ఆ మహానటికి మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం.
- Viswanath and Sons Movie Review: సూర్య క్లాస్ ఫ్యామిలీ డ్రామా మెప్పించిందా?
- Agadha Movie Review: ఎం.ఎస్. రాజు హారర్ థ్రిల్లర్ భయపెట్టిందా? కామాక్షియాక్టింగ్ ఎలా ఉంది?
- Vishal Makutam Movie Review: డెరైక్టర్‌గా మెప్పించాడా? మాస్ యాక్షన్ వర్కౌట్ అయిందా?
- Pallaburusu Movie Review: పళ్ళ బురుసు మూవీ రివ్యూ


