Actor Ponnambalam Sad Story: సినీ అభిమానుల గుండెల్లో ఓ భయంకరమైన విలన్‌గా ముద్ర వేసుకున్న పేరు పొన్నాంబళం.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందల చిత్రాల్లో నటించి, తన కండలు తిరిగిన దేహంతో తెరపై ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారాయన. రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, నాగార్జున వంటి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి, తనదైన శైలిలో ప్రేక్షకులను భయపెట్టారు.
స్టంట్‌మ్యాన్‌గా మొదలైన పొన్నాంబళం సినీ ప్రయాణం, ఎంతో కష్టంతో కూడుకున్నది. ఎంత ప్రమాదకరమైన ఫైట్‌లైనా ఎలాంటి గాయాలు లేకుండా చేసే ఆయన ధైర్యానికి ‘స్పేర్ పార్ట్స్’ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత 1988లో నటుడిగా మారి, అనతి కాలంలోనే అగ్ర కథానాయకుల చిత్రాల్లో విలన్‌గా స్థిరపడ్డారు. తెలుగులో ‘ఘరానా మొగుడు’, ‘హిట్లర్’, ‘చెన్నకేశవ రెడ్డి’ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో ఆయన విలనిజం ప్రేక్షకులకు బాగా గుర్తుంది. ఒకప్పుడు ఒకే ఏడాది పది సినిమాల్లో నటించి, కెరీర్ పీక్స్‌లో ఉన్న ఆయన జీవితం అనుకోని మలుపు తిరిగింది.
పొన్నంబలం కి ఏమైంది? What happened… – Actor Ponnambalam Sad Story?
సినిమా అవకాశాలు తగ్గడంతో పొన్నాంబళం జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. మానసికంగా కృంగిపోయి, మధ్యానికి బానిసయ్యారు. ఆ అలవాటు ఆయన ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు తెచ్చింది. చివరికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 2021 నుంచి డయాలసిస్ చేయించుకుంటూ, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.
ఈ కష్టాన్ని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. “డయాలసిస్ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన శిక్ష” అని కన్నీళ్లు పెట్టుకున్నారు. “గత నాలుగు సంవత్సరాలుగా రోజు మార్చి రోజు నా శరీరం లో 750 సార్లు ఇంజెక్షన్లు వేయించుకున్నాను. ఉప్పు తినలేను, కడుపు నిండా భోజనం చేయలేను. ఈ కష్టం నా శత్రువులకు కూడా రాకూడదు” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఈ కష్టకాలంలో కొందరు సినీ ప్రముఖులు ఆయనకు అండగా నిలిచారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయం గురించి చెప్తూ పొన్నాంబళం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు సెట్‌లో తమ మధ్య జరిగిన గొడవను కూడా పట్టించుకోకుండా, తాను అడగగానే చిరంజీవి ఆర్థికంగా సాయం చేశారని తెలిపారు. “ఒకటో, రెండు లక్షలు ఇస్తారని అనుకున్నాను. కానీ నా వైద్యానికి అయ్యే 40 లక్షలు ఆయనే ఇస్తారని నేను ఊహించలేదు. ఇప్పటి వరకు ఆయన కోటి రూపాయల వరకు సహాయం చేశారు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని కృతజ్ఞతతో చెప్పారు. అలాగే, తమిళ ఇండస్ట్రీ నుంచి శరత్ కుమార్, ధనుష్, అర్జున్ కూడా అండగా నిలిచారని తెలిపారు.
ఈ కష్టాన్ని ఒంటరిగానే ఎదుర్కొంటున్నానని, తన కుటుంబాన్ని ఎప్పుడూ హాస్పిటల్‌కు పిలవలేదని పొన్నాంబళం బాధతో చెప్పారు. చివరగా, తనలా ఎవ్వరూ ఆరోగ్యాన్ని పాడుచేసుకోకూడదని, మద్యానికి బానిస కాకూడదని హృదయపూర్వకంగా సూచించారు. ఆయన ఆవేదన, కన్నీళ్లు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతున్నాయి.
- “తెలుగు వార్తలు, సినిమా అప్డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
- నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.


