Jana Nayakudu Movie Review: నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్… “ఇది నా లాస్ట్ సినిమా, ఇకపై ఓన్లీ పాలిటిక్స్!” అని ముందే చెప్పేసారు. సరే, థియేటర్‌కి వెళ్లి చివరిసారిగా విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఎమోషనల్ అవుదాం అని టికెట్ కొనుక్కుని కూర్చుంటే…
సినిమా చూస్తున్నంత సేపూ ప్రతీ ఒక్కరికీ వచ్చే డౌట్ ఒకటే… “జన నాయకుడు సినిమా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ రీమేకా?” అని! దానికి తోడు, “విజయ్ నెక్స్ట్ ఎలక్షన్స్ మైండ్ లో పెట్టుకుని చేసిన పొలిటికల్ స్టంట్ ఏమైనా నా?” ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? విజయ్ ఆఖరి సినిమా ప్లస్ అయిందా? మైనస్ అయిందా? అనేది ఈ ‘జన నాయకుడు’ రివ్యూలో క్లియర్‌గా చూద్దాం.
Jana Nayakudu కథేంటి?
కథ చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. మన వెట్రి కొండాన్ (విజయ్) జైల్లో ఖైదీగా ఉంటాడు. ఆ జైలర్ కన్నుమూసే ముందు తన కూతురు విజ్జి (మమితా బైజు)ని చూసుకునే భారమంతా హీరో భుజాన పెడతాడు. విజ్జి చిన్నప్పటి నుంచి పిరికిది. ఆమెలో భయం పోగొట్టి, పక్కా ధైర్యవంతురాలిగా మార్చి సైన్యంలోకి (Army) పంపడమే వెట్రి లైఫ్ టార్గెట్.
ఇంతవరకు ఓకే, సేమ్ టూ సేమ్ మన బాలయ్య ‘భగవంత్ కేసరి’ ఫ్లేవరే! అయితే ఇక్కడే దర్శకుడు హెచ్. వినోద్ తన మార్క్ ట్విస్ట్ ఇచ్చాడు. కథలోకి జాన్ హిమ్లర్ (బాబీ డియోల్) అనే ఒక పవర్‌ఫుల్ విలన్ వస్తాడు. అతనికి విజ్జితో మాత్రమే కాదు… రాజకీయ నాయకులతో, దేశంలో అలజడులు సృష్టించే భారీ కుట్రలతో కూడా లింకులు ఉంటాయి.
అసలు విజయ్ జైలుకు ఎందుకు వెళ్లాడు? ఈ పాపని విలన్ ఎందుకు టార్గెట్ చేశాడు? పర్సనల్ ఎమోషన్ నుంచి దేశాన్ని కాపాడే లెవల్‌కి ఈ డ్రామా ఎలా షిఫ్ట్ అయింది? అనేది మిగతా కథ.
ఫస్ట్ హాఫ్ ఓకే… సెకండ్ హాఫ్‌లోనే ‘సినిమా’ అంతా…!
ఫస్ట్ హాఫ్ వరకు సినిమా స్మూత్ గానే వెళ్తుంది. హీరో జైలు నుంచి రావడం, ఆ పిల్లలో ధైర్యం నింపడానికి ట్రై చేయడం, మధ్యలో చిన్న చిన్న కామెడీ, ఆకట్టుకునే భావోద్వేగాలు… అంతా బాగానే ఉంది. అనిరుధ్ కూడా తన బిజిఎమ్‌తో మంచి ఊపు తెచ్చాడు.
కానీ, అసలు రచ్చంతా సెకండ్ హాఫ్‌లోనే…!
ఇంటర్వెల్ అవ్వగానే దర్శకుడు భగవంత్ కేసరి (bhagavanth kesari) ఫ్లేవర్ నుంచి ఒక్కసారిగా రూట్ మార్చేసి “ఇది విజయ్ (CM Vijay) పొలిటికల్ ఎంట్రీకి లాంచ్ పాడ్ రా సామి!” అని గుర్తుచేస్తాడు. హఠాత్తుగా దేశభక్తి, తమిళనాడు రాజకీయం, సామాజిక సందేశాలు, ప్రజాస్వామ్యం అంటూ డైలాగుల వర్షం కురిపించడం మొదలుపెడతారు.
ఫస్ట్ హాఫ్‌లో ఎంతో ఇష్టంగా బిల్డప్ చేసిన ‘బాబాయ్-కూతురు’ లాంటి ఎమోషనల్ బాండింగ్ కాస్తా.. పక్కకి వెళ్లిపోయి, విజయ్ ఇచ్చే పొలిటికల్ స్పీచ్‌లే మెయిన్ అయిపోతాయి. హెచ్. వినోద్ మైండ్‌లో పెద్ద కాన్వాస్ ఉండి ఉండొచ్చు, కానీ అన్ని ఎలిమెంట్స్ (యాక్షన్, ఎమోషన్, పాలిటిక్స్, మాస్) ఒకే సినిమాలో రుద్దేసరికి క్లారిటీ మిస్ అయింది.
మొత్తం ‘భగవంత్ కేసరి’ రీమేకా?
కాదు, ఖచ్చితంగా కాదు! ఒక పిరికి అమ్మాయిని స్ట్రాంగ్ ఉమెన్‌గా మార్చాలనే కాన్సెప్ట్, హీరో క్యారెక్టరైజేషన్ చూస్తే బాలయ్య సినిమానే, కాకపోతే, ఇది డైరెక్ట్ రీమేక్ కాదు. ఆ పాయింట్ మాత్రమే తీసుకుని, దానికి విజయ్ పొలిటికల్ ఇమేజ్‌కి తగ్గట్టుగా విపరీతమైన మసాలా, రాజకీయం జోడించి కొత్తగా ట్రై చేశారు.
అయితే, తమిళ రాజకీయం ఆధారంగా ఉన్న పంచ్ డైలాగులు అక్కడ వర్కౌట్ అవుతాయేమో కానీ, తెలుగులో డబ్ చేసి చూసేసరికి మనోళ్లకు పెద్దగా కనెక్ట్ కావు. “ఏందిరా ఈ పొలిటికల్ సోది” అని సగటు ప్రేక్షకుడు తల గోక్కునే పరిస్థితి!
నటీనటులు ఎలా చేశారు?
-
విజయ్ (Vijay): సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. ఫ్యాన్స్ కి నచ్చే, ఫాన్స్ ఎక్కువగా కోరుకునే ఎలివేషన్లు, స్టైలిష్ ఫైట్లు, అదిరిపోయే స్టెప్పులు, విజిల్స్ వేయించే డైలాగ్స్‌తో విజయ్ రచ్చ లేపాడనే చెప్పాలి. కాకపోతే, ఒక నటుడిగా ఆయనలోని వేరే కోణాన్ని చూడటానికి స్కోప్ లేదు. ఓన్లీ విజయ్ ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది.
-
మమితా బైజు (mamitha baiju): ఇచ్చిన పాత్ర పరిధిలో బాగానే నటించింది, కానీ స్క్రీన్‌ప్లే వల్ల ఆమె క్యారెక్టర్ ఎమోషన్ సెకండ్ హాఫ్‌లో డ్రాప్ అయిపోయింది.
-
పూజా హెగ్డే (pooja hegde): గ్లామర్ యాడింగ్ తోపాటు, రోల్ కొంచమైనా కరెక్ట్ గా సెట్ అయిందనే ఫిల్ వస్తుంది.
-
బాబీ డియోల్ (bobby deol) & ఇతరులు: బాబీ డియోల్ లుక్స్ కేక, ఆ విలన్ క్యారెక్టర్‌లో డెప్త్ … బెస్ట్ అనిపించేలా ఉంది. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ మీనన్ లాంటి సీనియర్లు ఉన్నా… పాపం వాళ్లకు గురుతుండిపోయే ఒక్క సీన్ కూడా దక్కలేదు కానీ, ప్రెజెన్స్ బాగుంది.
టెక్నికల్ డీటైల్స్ & నెగెటివ్స్
-
సినిమాటోగ్రఫీ: విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ రిచ్‌గా తీశారు.
-
ఎడిటింగ్: సెకండ్ హాఫ్‌లో కత్తెరకు చాలా పని ఉంది. డ్రాగ్ చేసిన సీన్లు చాలా ఉన్నాయి.
-
సంగీతం: అనిరుధ్ (anirudh ravichander) యాక్షన్ సీన్లలో బిజిఎమ్‌తో రచ్చ లేపినా… సినిమా అయిపోయాక హమ్మింగ్ అయ్యే రేంజ్ సాంగ్స్ కానీ, థీమ్ మ్యూజిక్ కానీ లేవు.
చివరిగా… చూడొచ్చా? చూడకూడదా?
నువ్వు పక్కా దళపతి విజయ్ డైహార్డ్ ఫ్యాన్ అయితే… ఆయన లాస్ట్ సినిమా కాబట్టి, ఆ మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ చూసి ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా థియేటర్‌కి వెళ్లొచ్చు.
కానీ, నీకు ఒక మంచి కథ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, అద్భుతమైన ఎమోషన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం… ఈ ‘జన నాయకుడు’ నీకు కొంచెం మిశ్రమ అనుభూతినే ఇస్తాడు. ఒక పొలిటికల్ ఎంట్రీ కోసం తీసిన కమర్షియల్ మాస్ డ్రామాగా మాత్రమే ఇది మిగిలిపోతుంది!
“Jana Nayakudu Movie Review” బాటమ్ లైన్: విజయ్ పొలిటికల్ మైలేజ్ కోసం చేసిన ప్రయోగం… ఫ్యాన్స్‌కి పండగే, కానీ మిగతా వారికి పర్వాలేదనిపించే ఆవరేజ్ రైడ్!
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెలుగు డబ్బింగ్ మూవీస్లు


