EPFO Fake Links Alert: ఈపీఎఫ్ఓ (EPFO) చందాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఆన్లైన్లో పీఎఫ్ సేవలు వాడుకునే వారి సంఖ్య పెరగడంతో, సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులు, ఫేక్ వెబ్సైట్లతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.
EPFO Fake Links Alert – పీఎఫ్ ఖాతాదారులు సురక్షితంగా ఉండటానికి పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:
- అధికారిక సైట్ మాత్రమే వాడండి: పీఎఫ్ సేవలకు సంబంధించిన పనుల కోసం ఎప్పుడైనా సరే అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించండి. వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు దాని యూఆర్ఎల్ (URL) స్పెల్లింగ్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి.
- గుర్తుతెలియని లింక్‌లు నమ్మవద్దు: వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై అస్సలు క్లిక్ చేయకూడదు. EPFO Fake Links Alert చేస్తూ… నకిలీ లింక్‌లతో జాగ్రత్త అని .. ఈపీఎఫ్ఓ వార్నింగ్! ఇచ్చింది.
- వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వొద్దు: ఈపీఎఫ్ఓ సంస్థ ఎప్పుడూ కూడా ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా మీ UAN, పాస్వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు లేదా ఓటీపీ (OTP) వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడగదు. కాబట్టి వీటిని ఎవరితోనూ పంచుకోవద్దు.
- ఫిర్యాదు చేయండి: ఏవైనా నకిలీ సైట్లు లేదా అనుమానాస్పద సందేశాలు మీ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం మంచిది.
“ఆ తొందరలో ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేయకుండా, కొంచెం జాగ్రత్తగా ఉంటే మన కష్టార్జితం భద్రంగా ఉంటుంది” అంటూ… EPFO Fraud Alert చేసింది.
ఇవీ చదవండి:
New Cyber Fraud: OTP, డెబిట్ కార్డు లేకుండా డబ్బు కొట్టేస్తున్నారు


