Chennai Love Story OTT Date:ప్రేమలో ఫెయిల్ అయితే వచ్చే ఆ బాధ ఉందే… దాన్ని తట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. మరి అలాంటి బ్రేక్అప్ పెయిన్‌లో ఉన్న ఒక అమ్మాయి లైఫ్‌లోకి, సినిమా కష్టాల్లో ఉన్న ఒక కుర్రాడు ఎంటర్ అయితే ఆ ‘చెన్నై లవ్‌స్టోరీ’ ఎలా ఉంటుంది? ఇదే కాన్సెప్ట్‌తో రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చి యూత్‌ని బాగా ఆకట్టుకున్న సినిమానే ‘చెన్నై లవ్‌స్టోరీ’.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా రవి నంబూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ బ్యూటిఫుల్ లవ్ డ్రామా.. ఇప్పుడు ఓటీటీ రన్ కి రెడీ అయిపోయింది. ఆగస్టు 21 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ (SonyLIV) లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి వస్తోంది.
నివి (శ్రీ గౌరీ ప్రియ) తాను ప్రాణంగా ప్రేమించిన అజయ్ (త్రిగుణ్)ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తీరా పెళ్లి ముహూర్తం దగ్గర పడేసరికి.. “నేను నిన్ను కాదు, వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నా” అని చెప్పి అజయ్ షాక్ ఇస్తాడు. దాంతో నివి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది.
ఆమెను ఆ బాధ నుంచి బయటపడేయాలని ఫ్రెండ్స్ చెన్నై తీసుకెళ్లినా ఫలితం ఉండదు. బ్రేక్అప్ పెయిన్ తట్టుకోలేక ఫుల్లుగా తాగుతూ లైఫ్‌ని వేస్ట్ చేసుకుంటుంది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే ఆమె ఫ్రెండ్స్ ఉండే ఇంట్లోకి స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) అడుగుపెడతాడు.
అనాథ అయిన స్టీవెన్.. ఎలాగైనా పెద్ద డైరెక్టర్ కావాలనే కలలతో చెన్నైకి వస్తాడు. స్టార్టింగ్‌లో స్టీవెన్ చేసే పిచ్చి పనులు నివికి కాస్త చిరాకు తెప్పిస్తాయి. కానీ రానురానూ అతని మాటలు, పాజిటివ్ ఆటిట్యూడ్ నివిలో ఊహించని మార్పు తీసుకొస్తాయి. మెల్లగా బ్రేక్అప్ బాధ నుంచి బయటపడి స్టీవెన్‌కి కనెక్ట్ అయిపోతుంది. మరి ఆ తర్వాత వాళ్ళిద్దరి లవ్ జర్నీ ఏ మలుపులు తిరిగింది? అనేది తెలియాలంటే Chennai Love Story OTT లో చూసేయాల్సిందే!